Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 15 2021 @ 18:16PM

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కి మంత్రి కేటీఆర్‌ లేఖ

హైదరాబాద్: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కి రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. కంటోన్మెంట్ పరిధిలో గవర్నమెంట్ రోడ్లను మూసివేయకుండా స్థానిక మిలిటరీ అధికారలుకు ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్‌ కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని లోకల్ మిలిటరీ అథారిటీ ఇష్టానుసారం రోడ్లను మూసివేస్తోందని ఆ లేఖలో కేటీఆర్‌ ఫిర్యాదు చేశారు. దీంతో లక్షలాది మంది నగర వాసులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్‌ ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. కంటోన్మెంట్ పరిధిలోని రోడ్లను మూసి వేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 

Advertisement
Advertisement