మర్కోక్ పోలీస్ స్టేషన్ బారెక్ ను ప్రారంభించిన హోం మంత్రి

ABN , First Publish Date - 2021-10-17T01:49:01+05:30 IST

సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలోని మర్కొక్ పోలీస్ స్టేషన్ బారేక్ ను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ ప్రారంభించారు.

మర్కోక్ పోలీస్ స్టేషన్ బారెక్ ను ప్రారంభించిన హోం మంత్రి

సిద్దిపేట: సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలోని మర్కొక్  పోలీస్ స్టేషన్ బారేక్ ను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ ప్రారంభించారు. పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్  చైర్మన్ కోలేటి దామోదర్ , రాష్ట్ర డిజిపి ఎం. మహేందర్ రెడ్డి,సిద్దిపేట కమీషనర్ జోయల్ డేవిస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడినప్పటి నుండి పోలీసులు ప్రజలతో మెరుగైన సంబంధాలు ఏర్పరచుకుని వారి సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధించారన్నారు. గత ఏడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం స్నేహపూర్వక పోలీసింగ్ తో సహా పోలీసు శాఖలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టిందని కొనియాడారు. 


తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు శాఖకు ప్రాధాన్యతను కల్పించారని , గత ఏడేళ్లలో తెలంగాణ పోలీసులు అద్భుతమైన పనితీరుతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారని హోం మంత్రి అన్నారు. తెలంగాణ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించడం ద్వారా కేసులను  చేదించగలుగుతున్నారని మంత్రి చెప్పారు. తెలంగాణలో మహిళల భద్రత అత్యంత ప్రాముఖ్యత ఇచ్చామని, వారి సమస్యలను పరిష్కరించడానికి, వారికి భద్రత కల్పించడానికి  షీ టీమ్స్, భరోసా, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేశామన్నారు.తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T01:49:01+05:30 IST