సొంతూళ్లకు క్షేమంగా వలస కార్మికులు

ABN , First Publish Date - 2020-05-18T11:03:18+05:30 IST

వలస కార్మికులకు సొంత గ్రామాలకు క్షేమంగా తరలించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్న మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.

సొంతూళ్లకు క్షేమంగా వలస కార్మికులు

కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి మల్లారెడ్డి


మేడ్చల్‌: వలస కార్మికులకు సొంత గ్రామాలకు క్షేమంగా తరలించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్న మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌లోని వివిధ ఫంక్షన్‌ హాళ్లలో ఉన్న వలస కార్మికులను తరలించే సహాయక చర్యలను ఆదివారం సాయంత్రం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు మేడ్చల్‌ పరిధిలో ఉన్న వలస కార్మికులను వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలతో చర్చించి వారికి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి పంపిస్తున్నట్లు తెలిపారు. మంత్రి మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్‌ జెండా ఊపి కార్మికులు వెళ్లే బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


మూడు బస్సులో..

మేడ్చల్‌ రూరల్‌: మేడ్చ ల్‌ పట్టణం నుంచి బిహార్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాలకు వెళ్లే వలస కార్మికులను ఆదివారం మూడు ఆర్టీసీ బస్సు ల్లో ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌కు తరలించారు. ఇటీవల కార్మి కులు తమ వివరాలు సమర్పి ంచడంతో వారిలో కొందరిని ఎంపిక చేసి పంపు తున్నట్లు అధికారులు తెలిపారు. ఘట్‌ కేసర్‌కు వెళ్లి అక్క డి నుంచి ప్రత్యేక రైలులో వారిని స్వరాష్ట్రాలకు పంపనున్నట్లు వారు తెలిపారు. మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి మూడు బస్సుల్లో దాదాపు 70మంది వలస కార్మికులు ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌కు తరలివెళ్లారు.


Updated Date - 2020-05-18T11:03:18+05:30 IST