Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 26 2021 @ 11:16AM

రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నా: మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్: తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎప్పుడు రాజీనామా చేస్తే.. తాను అప్పుడు రాజీనామా చేస్తానన్నారు. ఎప్పుడూ సహనం కోల్పోలేదన్నారు. తప్పుడు పనులు చేయలేదని.. కష్టపడి ఈ స్థాయికి వచ్చానన్నారు. మెడికల్ కాలేజీలు పెట్టి ఎంతో మంది డాక్టర్లను తయారుచేశానన్నారు.


రేవంత్ పీసీసీ అయిన దగ్గర నుంచి సీఎం కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మల్లారెడ్డి మండిపడ్డారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని ముఖ్యమంత్రి చేసి చూపించారని కొనియాడారు. రేవంత్‌కు ఇవ్వాల్సిన ఎంపీ సీటు తనకు ఇచ్చారని ఆయన కక్ష గట్టారన్నారు. గతంలో అనేక సార్లు  రేవంత్‌రెడ్డి తనను బ్లాక్‌ మెయిల్ చేశారన్నారు. తనను ఒక్కమాట అంటే.. పది మాటలు అని చూపిస్తానని, రేవంత్‌రెడ్డి తిడితే తాను పడాలా? అంటూ మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement