తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు మంచి భవిష్యత్ వుంది: నిరంజన్ రెడ్డి

ABN , First Publish Date - 2021-07-17T20:54:42+05:30 IST

లంగవాణలో ఆయిల్ పామ్ సాగుకు మంచి భవిష్యత్ వుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.దేశ ప్రజల అవసరాలకు ఏడాదికి 22 మిలియన్ టన్నుల నూనె అవసరం.

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు మంచి భవిష్యత్ వుంది: నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగవాణలో ఆయిల్ పామ్ సాగుకు మంచి భవిష్యత్ వుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.దేశ ప్రజల అవసరాలకు ఏడాదికి 22 మిలియన్ టన్నుల నూనె అవసరం. కానీ దేశంలో ఏడు మిలియన్ టన్నుల నూనె గింజలను మాత్రమే సాగు చేస్తున్నామని అన్నారు. “తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ” పై టీ శాట్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఆయిల్ పామ్ సాగు  అన్న అంశంపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి ,ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, అయిల్ ఫెడ్ ఎండీ సురేందర్, ఆయిల్ ఫెడ్ జాయింట్ డైరెక్టర్ సరోజిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ మాట్లాడుతూ దేశ అవసరాల కోసం 70వేల కోట్ల రూపాయల పామ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటున్నాం. 


ఈ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూనెగింజల సాగును పోత్సహిస్తున్నాయని అన్నారు. నువ్వులు, కుసుమ, వేరుశనగ తదితర నూనెగింజల సాగును ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దేశ అవసరాలకు ఆయిల్ పామ్ సాగు 80 లక్షల ఎకరాలలో చేపట్టాల్సి ఉంది. కానీ 8 లక్షల ఎకరాలే సాగవుతుందని మంత్రి తెలిపారు.అందుకే తెలంగాణలో  20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాలని నిర్ణయించిందన్నారు. టన్ను ఆయిల్ పామ్ గెలలకు రూ.19 వేలు ధర పలుకుతుంది ఎకరాకు 15 నుండి 20 టన్నుల దిగుబడి వస్తుంది. ఎకరాకు రూ.36 వేలు సబ్సిడీ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. మన దగ్గర పండే ఆయిల్ పామ్ గెలలలో అధిక నూనె శాతం ఉన్నట్లు పరిశోధనా సంస్థలు తేల్చిచెప్పాయి. 


ఆయిల్ పామ్ సాగు చేసే రైతాంగానికి ఉపాధిహామీ కింద గుంతల తవ్వకం, మైక్రో ఇరిగేషన్ కింద డ్రిప్ పరికరాలు, అవసరమైన రైతులకు సమీప బ్యాంకులను టై అప్ చేసి రుణాలు ఇప్పించే ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపుతో పథకాన్ని రూపొందించారని తెలిపారు. సాంప్రదాయ పంటల సాగుతో రైతులు నష్టపోకుండా పంటల మార్పిడిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఆయిల్ ఫెడ్ ద్వారానే 2 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ ను సాగు చేసేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందని వెల్లడించారు.ఏ ప్రభుత్వం అయినా జనాభాలో 1 శాతం, ఒకటిన్నర శాతం మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలను అందించగలుగుతుంది.తెలంగాణ ఏర్పడిన తర్వాత లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రతి ఏటా రెగ్యులర్ గా ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని అన్నారు.

Updated Date - 2021-07-17T20:54:42+05:30 IST