అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం కావాలి-నిరంజన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-01-17T20:37:59+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి పనులన్నింటిలోనూ ప్రజల భాగస్వామ్యం కావాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం కావాలి-నిరంజన్‌రెడ్డి

వనపర్తి: తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి పనులన్నింటిలోనూ ప్రజల భాగస్వామ్యం కావాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. పధకాలు ప్రజలకు చేరినప్పుడు అవి సద్వినియోగం అవుతాయన్నారు. హరితహారం, పల్లె ప్రగతి వంటి సామూహిక పధకాల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. వనపర్తి మండలం పెద్దగూడెంలో మంత్రి నిరంజన్‌రెడ్డి పల్లె నిద్ర చేశారు. ఆదవారం ఉదయం ఆయన గ్రామంలో పలు ప్రాంతాలను సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సామూహిక కార్యక్రమాలు విజయవంతమైతూ గొప్ప సమాజం నిర్మాణమవుతుందన్నారు. 


ఈసందర్భంగా మంత్రి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాల్సి అవసరం ఉందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాలతో పాటు పల్లెల్లో సాగునీటి వసతులు మెరుగుపడడంతో ఉపాధి అవకాశాలుకూడా పెరుగుతున్నాయని చెప్పారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవాలన్న లక్ష్యంతోనే పల్లె నిద్ర కార్యక్రమం చేసినట్టు మంత్రి తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. పల్లె నిద్ర కార్యక్రమాన్ని  కొనసాగిస్తానన్నారు. 

Updated Date - 2021-01-17T20:37:59+05:30 IST