Advertisement
Advertisement
Abn logo
Advertisement

నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలి

  • పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి 
  • విశాఖలో ఇండియా స్కిల్‌ ప్రాంతీయ పోటీలు ప్రారంభం 


బీచ్‌రోడ్డు (విశాఖపట్నం), డిసెంబరు 1: భవిష్యత్తులో స్కిల్‌ డెవలె్‌పమెంట్‌ కీలకంగా మారుతుందని, నైపుణ్యం కలిగిన వారికి ఎక్కువ అవకాశాలుంటాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. విశాఖ ఆర్కేబీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాలులో బుధవారం ఇండియా స్కిల్‌-2021 దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పోటీల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్నారు.  ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ స్కిల్‌ డెవల్‌పమెంట్‌కు సంబంధించిన మైక్రో లెవెల్‌ సర్టిఫికెట్‌ కోర్సులను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రారంభించనున్నామన్నారు. నాలుగు రోజులుపాటు జరిగే  పోటీల్లో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 500 మంది విద్యార్థులు పాల్గొని ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో స్టేట్‌ స్కిల్‌ డెవలె్‌పమెంట్‌ సంస్థ చైర్‌పర్సన్‌ జయలక్ష్మి, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, సంస్థ ఎండీ బంగార్రాజు, వరల్డ్‌ స్కిల్‌ డైరెక్టర్‌ ప్రకాశ్‌శర్మ, కొండూరు అజయ్‌రెడ్డి, ఎన్‌ఎ్‌సడీసీ ప్రతినిధి అరుణ్‌ చాండిల్‌, పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement