Abn logo
May 25 2020 @ 04:04AM

ప్రతి ఇంట్లో రంజాన్‌ కళ కనిపించాలి

10 రకాల నిత్యావసర వస్తువులతో తోఫా

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌


ఖమ్మం కార్పొరేషన్‌, మే24: లాక్‌డౌన్‌ విపత్కర పరిస్థితి ఉన్నప్పటికీ ప్రతీ ముస్లిం ఇంట్లో రంజాన్‌ కళ కనిపించాలని రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం రెండోరోజు నగరంలోని 11,21,26 డివిజన్లలో ముస్లిం కుటుంబాలకు రంజాన్‌ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ పేద ముస్లిం కుటుంబం రంజాన్‌ పండుగను జరుపుకోవాలనే ఉద్దేశ్యంతోనే  రంజాన్‌కిట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి ఏడాది రంజాన్‌కు కిట్టను అందచేస్తున్నామని, అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈసారి 10 రకాల నిత్యావసర వస్తువులు కలిపి ఇస్తున్నామన్నారు.


మొత్తం ఐదు వేల ముస్లింకుటుంబాలకు రంజాన్‌కిట్లను అందించేందుకు ఏర్పాట్లు చేశామని మంత్రి పేర్కొన్నారు. శనివారం రెండు వేల కుటుంబాలకు, ఆదివారం మూడు వేల కుటుంబాలకు రంజాన్‌కిట్లు అందచేశామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ డాక్టర్‌ జి. పాపాలాల్‌, ఉపమేయర్‌ బత్తుల మురళి, టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌లీడర్‌, 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ కర్నాటి కృష్ణ, 11వ డివిజన్‌ కార్పొరేటర్‌ బిక్కసాని ప్రశాంతలక్ష్మి, 26వ డివిజన్‌ కార్పొరేటర్‌ పగడాల నాగరాజు పాల్గొన్నారు.


సేవా కార్యక్రమాల్లో ముందుండాలి.

ఖమ్మం కార్పొరేషన్‌: యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు సేవాకార్యక్రమాల్లో ముందుండాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్‌ తుంబూరు దయాకరరెడ్డి పేర్కొన్నారు. శ్రీ శబరిగణేష్‌ యూత్‌ ఆధ్వర్యంలో 42వ డివిజన్‌లో 100 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్‌తోఫాను  పంపిణీచేశారు.   


నగరంలోని 46వ డివిజన్‌లో 50 ముస్లింకుటుంబాలకు సొంత నిధులతో సమకూర్చిన రంజాన్‌ తోఫా కిట్లను ఏఎంసీ మాజీ చైర్మన్‌ గుండాల కృష్ణ ఆదివారం పంపిణీచేశారు.


18వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు గోళ్ల వెంకట్‌, నాయకుడు బచ్చు విజయ్‌కుమార్‌ చేతుల మీదుగా ముస్లిం కుటుంబాలకు రంజాన్‌ తోఫా కిట్లు అందజేశారు.


ముస్లింలకు ఎమ్మెల్యే సండ్ర రంజాన్‌ శుభాకాంక్షలు

సత్తుపల్లి: ముస్లింలకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ వారి జీవితాల్లో కొత్త సంతోషాలను నింపాలని ఆకాంక్షించారు.  ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకుంటూ, కోవిడ్‌-19 నియంత్రణకు సహకరించాలని కోరారు.


ముస్లింలకు అతిపవిత్రమైనది రంజాన్‌: ఎమ్మెల్యే రాములు నాయక్‌

వైరా: ముస్లింలకు అత్యంత పవిత్రమైనది రంజాన్‌ అని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ పేర్కొన్నారు. మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర వైస్‌చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌తో కలిసి ఆదివారం వైరాలోని క్యాంపు కార్యాలయంలో పేద ముస్లింలకు రంజాన్‌ తోఫాను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.  కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ జైపాల్‌, సీ తారాములు, ఏఎంసీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసుపులేటి మోహన్‌రావు పాల్గొన్నారు.


వైరా: రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని వైరా లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ముస్లింలకు రంజాన్‌ తోఫా ఏసీపీ కె.సత్యనారాయణ పంపిణీ చేశారు. లయన్స్‌క్లబ్‌ డైరెక్టర్లు నం బూరి మధు, గజ్జల కృష్ణమూర్తి సహకారంతో రూ.20వేల విలువలైన రంజాన్‌ తోఫాను నిరుపేద ముస్లింలకు అందించారు.  


తల్లాడ:  సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదువేల ముస్లిం కుటుంబాలకు రంజాన్‌ తోఫా కిట్లను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం తల్లాడ, మల్లవరంలో ముస్లింలకు తోఫా కిట్లను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమం లో డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావు, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల పాల్గొన్నారు.


సత్తుపల్లి: బీజేపీ ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలో 200 మంది ముస్లింలకు రంజాన్‌ పండుగ సందర్భంగా పండుగకు అవసరమైన సేమ్యా ఇతర సరుకులతో కూడిన కిట్లను ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూసంపూడి రవీంద్ర, నాయకులు ఉడతనేని అప్పారావులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో  పోట్రు కళ్యాన్‌, సుదర్శన్‌ మిశ్రా, చక్కా మధుసూదనరావు, నాగస్వామి, రవి, బండారు వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. 


కొత్తగూడెం సాంస్కృతికం:  జిల్లా మహిళాకాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, పీఆర్‌టీయూ, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో ముస్లింలకు  తోఫాను అందజేసి రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. విరివిగా జరిగిన ఈకార్యక్రమాల్లో కాంగ్రెస్‌ మహిళా జిల్లా నాయకురాలు తోట దేవిప్రసన్న, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు  వనమా రాఘవేంద్రరావు, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షులు డి.వెంకటేశ్వరరావే, సీపీఐ రాష్ట్రసహాయక కార్యాదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్‌పాష పాల్గొన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్‌ పంచాయితీలోని  శ్రీనగర్‌, ఇందిరానగర్‌లోని పేద ముస్లీంలకు పండుగ సరుకులను (తోఫా)ను లక్ష్మీస్పోర్ట్స్‌ అధినేత శ్యామ్‌ సహకారంతో ఎంపీపీ భూక్యాసోనా, ఎంపీటీసీ కొల్లు పద్మ, తహసీల్దార్‌ భద్రకాళి చేతులమీదుగా అందజేశారు. 

Advertisement
Advertisement