రైతులను అయోమయానికి గురిచేస్తున్న కేంద్రం: సత్యవతి

ABN , First Publish Date - 2021-11-17T22:25:47+05:30 IST

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో వారిని అయోమయానికి గురి చేస్తున్నారని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు

రైతులను అయోమయానికి గురిచేస్తున్న కేంద్రం: సత్యవతి

మహబూబాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో వారిని అయోమయానికి గురి చేస్తున్నారని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం యాసంగి పంట కొంటదా లేదా ముందు స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బుధశారం ఆమె మహబూబాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రైతుల మేలు కోరే వారైతే బిజెపి ప్రభుత్వం యాసంగి పంటను కొనుగోలుచేయాలన్నారు.రాష్ట్రంలో బిజెపి నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. రాష్ట్రంలోని బిజెపి నాయకుల మాటలకు, చేతలకు పొంతనలేదని రైతులు తిరగబడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. 


రాష్ట్రంలో 60 లక్షల మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వారిలో చాలామంది రైతులున్నారు. నిజంగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేయాలనుకుంటే, అడ్డుకోవాలనుకుంటే రాష్ట్ర బిజెపి అధినేత బండి సంజయ్ ఏ ఊరు తిరగ లేవని అన్నారు. ఇలాంటి తెలివితక్కువ మాటలు బంద్ చేసి, రోడ్ల మీద తిరగడం బంద్ చేసి ఢిల్లీలో తిరుగు అని బండికి హితవు పలికారు. బండి సంజయ్ దమ్ముంటే కేంద్రాన్ని ఒప్పించి యాసంగి పంటను కొనుగోలు చేయించాలన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న వారి మెడలు వంచడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. 

Updated Date - 2021-11-17T22:25:47+05:30 IST