రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2021-07-08T05:29:05+05:30 IST

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
భూపాలపల్లిలో మొక్కలు నాటుతున్న మంత్రి సత్యవతి, ఎమ్మెల్యే గండ్ర

రాష్ట్ర గిరిజన, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌

గణపురం, జూలై 7: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ  శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మండంలో ఆమె బుధవారం పర్యటించారు. పల్లెప్రగతిలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి పాల్గొన్నారు. గణపురం గ్రామ పంచాయతీ కార్యాలయం నూతన భవనం, రైతు వేదికను ఆమె ప్రారంభించారు. మండల కేంద్రంలోని  కోటగుళ్లను సందర్శించి గణపేశ్వరాలయంలో స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మండల కేంద్రంలో సుమారు రూ. 50 లక్షలతో పంచాయతీ కార్యాలయం, రూ. 22 లక్షలతో రైతు వేదికను నిర్మించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం గ్రామీణాభివృద్ధికి మరింత దోహదపడుతోందన్నారు. పచ్చదనం, పరిశుభ్రతపై ప్రభుత్వం దృష్టిపెట్టిం దన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కల నాటేందుకు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, ఇందులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కోటగుళ్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండల కేంద్రంలో పిల్లర్లకే పరిమితమైన మ హిళా సమాఖ్య భవన నిర్మాణానికి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త నమూ నా పరికరాల కొనుగోలుకు ప్రత్యేక నిఽధులను కేటాయించేందుకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాలు, సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత ము ఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.గణప సముద్రాన్ని పర్యాటక ప్రాం తంగా అభివృద్ధి చేస్తామని, మండల కేంద్రంలో సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తామని అన్నారు. ధర్మరావుపేట శివారులో వ్యవసాయ భూముల విషయంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టి రైతులకు న్యాయం చే స్తామన్నారు. సర్పంచ్‌ నారగాని దేవేందర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమా ల్లో ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, అడిషనల్‌ కలెక్టర్‌ రిజ్వాన్‌ పాషా షేక్‌, జి ల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి పురుషోత్తం, డీపీవో ఆశాలత, మండల ప్రత్యేక అధికారి కుమారస్వామి, డీఏవో విజయ్‌భాస్కర్‌, ఎంపీడీవో లెంకల అరుంధతి, తహసీల్దార్‌ కృష్ణ చైతన్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ పోరెడ్డి పూర్ణ చంద్రారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, ఎంపీపీ కావటి రజిత, జడ్పీటీసీ గండ్ర పద్మ, ఎంపీటీసీలు మోటపోతుల శివశంకర్‌గౌడ్‌, మంద అశోక్‌ రెడ్డి, చెన్నూరి రమాదేవి, కాల్య సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.  

పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు 

కృష్ణకాలనీ : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతి నెలా రూ. 369 కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర స్ర్తీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. బుధవారం భూపాలపల్లి మండలంలోని పెద్దాపూర్‌ గ్రామంలో రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాలను ఆమె ప్రారంభించారు.  గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గ్రామాల అభివృద్ధి కోసం పల్లె ప్రగతి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.   రైతులకు అన్ని రకాలు సేవలు ఒకేచోట లభించేలా రైతు వేదికలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అమలు చేస్తున్న రైతు విధానాలను యావత్‌ దేశం చూస్తోందన్నారు. మండలానికి ఒక వ్యవసాయ అధికారి గతంలో ఉంటే ప్రస్తుతం ఒక క్లస్టర్‌కు ఒక అధికారిని నియమించి వ ్యవసాయాన్ని పండగ చేశారన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌, రైతుబంధు సాయం, రైతుబీమా, పండు పంటలకు కావాల్సిన సాగునీరు, ఎరువులు, విత్తనాలు ఇస్తూ సీఎం కేసీఆర్‌ రైతుబాంధవుడయ్యారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్‌ పర్సన్‌ కళ్లెపు శోభ, ఎంపీపీ లావణ్య, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రవిందర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-08T05:29:05+05:30 IST