Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ

హైదరాబాద్: రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్రం లో చేపడుతున్న పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కి స్వదేశీ దర్శన్, ప్రసాద్ స్కీం లలో చేర్చి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం లో పర్యాటకాభివృద్ధి లో భాగంగా స్వదేశీ దర్శన్ స్కీం లో  చరిత్రాత్మక కోటల సంరక్షణ , మహబూబ్ నగర్ జిల్లాలోని పిలిగ్రీమేజ్ అండ్ నేచర్ టూరిజం సర్క్యూట్ ను, ప్రసిద్ధ బుద్ధిజం కేంద్రాల అభివృద్ధి చేయాలని వివరాల్ని అందించారు. ప్రసాద్ స్కీం లో భాగంగా భద్రాచలం లోని సీత రామచంద్ర స్వామి దేవస్థానం,


మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంను అభివృద్ధి చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలో సుమారు 25 కోట్ల రూపాయల తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న కల్చరల్ సెంటర్ కు ఠాగూర్ కల్చరల్ కాంప్లెక్స్ స్కీం ద్వారా 15 కోట్ల రూపాయల ఆర్థిక సహకారంను అందించాలని విజ్ఞప్తి చేశారు. అడాప్ట్ ఎ హెరిటేజ్ స్కీం లో ఎంపికైన గోల్కొండ కోట, అలంపూర్ జోగుళాంబ దేవాలయం, రామప్ప దేవాలయాల పనులను తక్షణమే ప్రారంభించాలని మంత్రి కోరారు. 

 

హైదరాబాద్ నగరం ఎంఐసిఈ టూరిజం, మెడికల్ క్యాపిటల్ గా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ ( ఐఐటిటిఎం) క్యాంపస్ ను ఏర్పాటు చేయాలని అందుకు అవసరమైన భూమిని ఉచితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతుందని అన్నారు. దీనికి అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.


Advertisement
Advertisement