నూజివీడు త్రిపుల్ ఐటీ ఘటనపై మంత్రి సీరియస్

ABN , First Publish Date - 2020-02-23T00:01:07+05:30 IST

నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటనపై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను కనిపెట్టుకుని ఉండక్కర్లేదా అని సిబ్బందిపై మండిపడ్డారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని

నూజివీడు త్రిపుల్ ఐటీ ఘటనపై మంత్రి సీరియస్

అమరావతి: నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటనపై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను కనిపెట్టుకుని ఉండక్కర్లేదా అని సిబ్బందిపై మండిపడ్డారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే నూజివీడు ట్రిపుల్ ఐటీని సందర్శిస్తానని మంత్రి సురేష్ తెలిపారు. 


కాగా, నూజివీడు ట్రిపుల్ ఐటీలో అర్థరాత్రి విద్యార్థినుల హాస్టల్‌లోకి ఓ యువకుడు చొరబడ్డాడు. కిటికీ ఊచలు తొలగించి అమ్మాయిల గదిలోకి వెళ్లాడు. అలా 12 గంటల పాటు గదిలోనే ఉండిపోయాడు. యువకుడు లోపలికి రావడానికి మరో విద్యార్థిని సహకరించినట్లు తెలుస్తోంది. అయితే దీన్ని గమనించిన ఇతర విద్యార్థినులు గదికి తాళం వేసి సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. తాళాలు పగులగొట్టి యువతి, యువకుడిని పట్టుకున్నారు. అనంతరం వారి వారి తల్లిదండ్రులను పిలిపించిన అధికారులు యువకుడికి సహాయం చేసిన యువతిని క్యాంపస్ నుంచి పంపించేశారు. అయితే, ఈనెల 16న ఘటన చోటుచేసుకోగా, అధికారులు మాత్రం దీన్ని గోప్యంగా ఉంచారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో బయటకి పొక్కడంతో అసలు విషయం బయటపడింది.

Updated Date - 2020-02-23T00:01:07+05:30 IST