గొర్రెల యూనిట్ల కోసం లబ్ధిదారులు డీడీలు చెల్లించండి

ABN , First Publish Date - 2021-08-08T00:14:03+05:30 IST

ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేస్తున్న గొర్రెల యూనిట్ల కోసం లబ్ధిదారులు వెంటనే డీడీలు అందజేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ ల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు

గొర్రెల యూనిట్ల కోసం లబ్ధిదారులు డీడీలు చెల్లించండి

హైదరాబాద్: ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేస్తున్న గొర్రెల యూనిట్ల కోసం లబ్ధిదారులు వెంటనే డీడీలు అందజేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ ల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఈ మేరకు రెండో విడత లో ఉన్న లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ కోసం చర్యలు చేపట్టాలని మంత్రి అన్ని జిల్లాల పశుసంవర్ధక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం కోసం  ప్రభుత్వం 6 వేల కోట్ల రూపాయలు విడుదల చేసిందని తెలిపారు.


అంతేకాకుండా గొర్రెల యూనిట్ ధరను కూడా 1.25 లక్షల నుండి 1.75 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని తెలిపారు. లబ్ధిదారులు వీలైనంత త్వరగా డీడీలు చెల్లించి సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. గొర్రెల పంపిణీ కార్యక్రమంకు వేలాది కోట్ల రూపాయల ను విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు గొల్ల, కురుమల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-08-08T00:14:03+05:30 IST