బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణస్వామి ముదిరాజ్ : తలసాని

ABN , First Publish Date - 2021-08-30T21:30:05+05:30 IST

నగర మాజీ మేయర్ కొర్వి కృష్ణస్వామి బహుముఖ ప్రజ్ఞాశాలి అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణస్వామి ముదిరాజ్ : తలసాని

హైదరాబాద్: నగర మాజీ మేయర్ కొర్వి కృష్ణస్వామి బహుముఖ ప్రజ్ఞాశాలి అని  పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం అంబర్ పేట లో ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొర్వి కృష్ణస్వామి 128 వ జయంతి వేడుకలకు మంత్రి శ్రీనివాస్ యాదవ్  ముఖ్య అతిదిగా హాజరైనారు. ముందుగా కృష్ణస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రచయితగా, సాహితీవేత్తగా, పాత్రికేయుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి గా కృష్ణస్వామి విశేష సేవలు అందించారని స్మరించుకున్నారు. హైదరాబాద్ నగర మేయర్ గా అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని చెప్పారు. ఎన్నో సేవలు అందించిన ఆయన ను గౌరవించుకోవాల్సిన బాద్యత మనందరి పై ఉందన్నారు. 


ముదిరాజ్ ల ఐక్యత కోసం ముదిరాజ్ సంక్షేమ సంఘాన్ని స్థాపించారని తెలిపారు. కృష్ణస్వామి విగ్రహం ఏర్పాటు చేయాలని, ముదిరాజ్ సంఘ భవనం నిర్మించాలని స్థానిక ముదిరాజ్ సంఘం నేతలు మంత్రిని కోరగా, స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన సొంత ఖర్చులతో కృష్ణస్వామి కాంస్య విగ్రహాన్ని వాచ్చే జయంతి నాటికి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. భవన నిర్మాణం చేపట్టడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కులవృత్తులను ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. 


వెనుకబడిన వర్గాల విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రెసిడెన్సియల్ పాఠశాలల ను ఏర్పాటు చేసిందని, ఉన్నత విద్య కోసం ఓవర్ సీస్ క్రింద 20 లక్షల రూపాయల వరకు ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు విజయ్ కుమార్, లావణ్య, పద్మ, మాజీ కార్పొరేటర్ పద్మావతి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు యాదగిరి, సతీష్, మహేష్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జూబ్లిహిల్స్ బస్టాప్ వద్ద నగేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణస్వామి వేడుకలలో కూడా మంత్రి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

Updated Date - 2021-08-30T21:30:05+05:30 IST