Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ ఏడాది భవానీల కోసం గిరి ప్రదక్షణ ఏర్పాటు చేస్తున్నాం : వెల్లంపల్లి

విజయవాడ : భవాని దీక్షా విమరణల కో ఆర్డినేషన్ సమావేశం మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నేడు జరిగింది. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి 29 వరకూ భవానీ దీక్షా విరమణలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులెవరూ ఇబ్బంది పడకుండా ఉండేందుకు అన్ని శాఖల అధికారులను సమన్వయం పరుస్తున్నామన్నారు. ఐదు రోజుల్లో లక్షల సంఖ్యలో భవానీలు అమ్మవారి దర్శనానికి వస్తుంటారని వెల్లంపల్లి తెలిపారు. ఈ ఏడాది భవానీల కోసం గిరి ప్రదక్షణ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేవాదాయ శాఖ నుంచి నిధుల పరంగా ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. కొవిడ్ నిబంధనల నడుమ అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు.

Advertisement
Advertisement