ఈ నెల 8న ఐదవ విడత చేప పిల్లల పంపిణీ

ABN , First Publish Date - 2021-09-05T21:58:29+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా 5వ విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఈ నెల 8 వ తేదీ నుండి ప్రారంభం కానున్నది. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం లోని చందలాపూర్ గ్రామంలోని

ఈ నెల 8న ఐదవ విడత చేప పిల్లల పంపిణీ

హైదరాబాద్: రాష్ట్ర  వ్యాప్తంగా 5వ విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఈ నెల 8 వ తేదీ  నుండి ప్రారంభం కానున్నది.  సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం లోని చందలాపూర్ గ్రామంలోని  రంగా నాయక్ సాగర్, సిద్దిపేట పట్టణ పరిదిలోని కోమటి చెరువులలో పశుసంవర్ధక, మత్స్య, పాడి  పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆర్ధిక శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు లతో కలిసి చేప పిల్లలను విడుదల చేసె కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అదే రోజు రాస్ట్రం లోని మిగతా  25 జిల్లాలో జిల్లా మంత్రులు ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించనున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా30 వేల రిజర్వాయర్ లు, చెరువులలో 80 కోట్ల రూపాయల ఖర్చుతో 93.16కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. 


అదే విధంగా 25  కోట్ల రూపాయల ఖర్చుతో 10  కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయడం జరుగుతుంది.చేప పిల్లల పంపిణీ కార్యక్రమాలలో పాల్గొనాలని కోరుతూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రంలోని మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ లను  వ్యక్తిగతంగా కోరనున్నారు. చేప పిల్లల విడుదల కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్య సహకార సొసైటీ సభ్యులు పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.కరోనా నేపద్యంలో చేప పిల్లల విడుదల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, శానిటైజర్లు, మాస్క్ లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది.

Updated Date - 2021-09-05T21:58:29+05:30 IST