విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసిన‌.. న‌ల్ల‌జాతీయుడిని చంపిన పోలీస్ అధికారి భార్య‌..

ABN , First Publish Date - 2020-05-31T16:06:35+05:30 IST

జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని తొక్కి చంపిన ఘటనలో శ్వేతజాతి పోలీసు డెరెక్ ఛౌవిన్‌ను విధుల నుంచి తొల‌గించ‌డంతో పాటు అత‌నిపై హత్య కేసు న‌మోదైంది.

విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసిన‌.. న‌ల్ల‌జాతీయుడిని చంపిన పోలీస్ అధికారి భార్య‌..

మినియాపొలిస్: జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని తొక్కి చంపిన ఘటనలో శ్వేతజాతి పోలీసు డెరెక్ ఛౌవిన్‌ను విధుల నుంచి తొల‌గించ‌డంతో పాటు అత‌నిపై హత్య కేసు న‌మోదైంది. మ‌రోవైపు ఈ ఘ‌టన‌పై న‌ల్ల‌జాతి నిర‌స‌న‌లు అగ్ర‌రాజ్యంలో తార‌స్థాయికి చేరాయి. దీంతో డెరెక్ భార్య కెల్లీ ఛౌవిన్ విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసింది. డెరెక్ నుంచి విడాకులు తీసుకుంటున్న‌ట్లు కెల్లీ శుక్ర‌వారం రాత్రి ప్ర‌క‌టించింది. ఈ ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌లిచివేసింద‌ని చెప్పిన కెల్లీ... మృతుడి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేసింది. ప్ర‌స్తుతం డెరెక్‌, కెల్లీల‌కు పిల్ల‌లు లేక‌పోయిన‌ప్ప‌టికీ భ‌విష్య‌త్తులో వేరే పెళ్లి చేసుకుంటే... అప్పుడే పుట్టే పిల్ల‌ల‌కు, త‌న ఫ్యామిలీకి భద్రత క‌ల్పించాల‌ని ఆమె కోరింది.


ఇదిలా ఉంటే... జార్జి ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలంటూ శుక్రవారం పలు నగరాల్లో వేలమంది నల్లజాతి ప్రజలు ప్రదర్శనలు నిర్వహించారు. మినియాపొలిస్‌లో కర్ఫ్యూను కూడా లెక్క చేయకుండా వరుసగా నాలుగో రోజూ భారీ ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా యువత విధ్వంసానికి, లూటీలకు పాల్పడ్డారు. దుకాణాలను, రెస్టారెంట్లను తగులబెట్టారు. దీంతో అగ్ర‌రాజ్యం ఆందోళ‌న‌ల‌తో అట్టుడుకుతోంది. 

Updated Date - 2020-05-31T16:06:35+05:30 IST