అనాథ ఆశ్రమం కేసులో కొత్త కోణాలు

ABN , First Publish Date - 2020-08-14T17:25:48+05:30 IST

అమీర్‌పూర్ అనాథ ఆశ్రమంలో ఒక్కోక్కటిగా ఘోరాలు వెలుగుచూస్తున్నాయి.

అనాథ ఆశ్రమం కేసులో కొత్త కోణాలు

హైదరాబాద్: అమీన్‌‌పూర్ అనాథ ఆశ్రమంలో ఒక్కోక్కటిగా ఘోరాలు వెలుగుచూస్తున్నాయి. ఆ ఆశ్రమంలో అత్యాచారానికి గురైన అనాధ బాలిక మృతి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. మరోవైపు ఆశ్రమంలో ఉన్నవారిని మరోచోటికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది.


ఈ కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. సంగారెడ్డి ఛైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలితో నిందితుడికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లాక్ డౌన్ సమయంలో రెస్క్యూ చేసిన మైనర్లను ఇక్కడికే పంపాలని సిబ్బందిపై ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. పలు సమావేశాలకు నిందితుడు వేణుగోపాల్ రెడ్డి నేరుగా హాజరైనట్లు తేలింది. మరోవైపు అనాథాశ్రమంలోని 70 మందిని అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ ఘటనతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మొత్తం 4 వందల ఆశ్రమాల్లో తనిఖీలు చేయాలని అధికారులు ఆదేశించారు.

Updated Date - 2020-08-14T17:25:48+05:30 IST