48 బంతుల్లో సెంచరీ చేసిన భార్య.. అభినందించిన ఆసీస్ పేసర్ స్టార్క్

ABN , First Publish Date - 2020-11-23T00:01:17+05:30 IST

మహిళల బిగ్‌బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో భాగంగా మెల్‌బోర్నస్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్ విమెన్ అలీస్సా

48 బంతుల్లో సెంచరీ చేసిన భార్య.. అభినందించిన ఆసీస్ పేసర్ స్టార్క్

సిడ్నీ: మహిళల బిగ్‌బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో భాగంగా మెల్‌బోర్న్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్ విమెన్ అలీస్సా హీలీ సెంచరీతో ఇరగదీసింది. నార్త్ సిడ్నీ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 48 బంతుల్లోనే సెంచరీ చేసిన అలిస్సాపై ప్రశంసల వర్షం కురిసింది. స్టేడియంలో ఉన్న అభిమానులు, సహచరులు కరతాళ ధ్వనులతో అభినందించారు. అలాగే, స్టేడియంలోనే ఉన్న అలిస్సా భర్త, ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ చప్పట్లు కొడుతూ ఆమెను అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీల్, స్టార్క్‌లు ఏప్రిల్ 2016లో వివాహం చేసుకున్నారు. కాగా, వీరిద్దరూ తమకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు తొలిసారి కలుసుకున్నారు.


డబ్ల్యూబీబీఎల్‌లో హీలికి ఇది నాలుగో శతకం. 30 ఏళ్ల హీలీ తాజా మ్యాచ్‌లో మొత్తం 52 బంతులు ఎదుర్కొని 213.46 స్ట్రైక్ రేట్‌తో 111 పరుగులు చేసింది. ఇందులో 15 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. డబ్ల్యూబీబీఎల్‌లో ఇది నాలుగో అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం గమనార్హం. 48 బంతుల్లోనే ఆమె సెంచరీ చేసింది.   




Updated Date - 2020-11-23T00:01:17+05:30 IST