పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2021-09-18T04:28:39+05:30 IST

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం కేసీఆర్‌ పార్టీ లకు అతీతంగా సంక్షేమ పథకాలను మంజూరు చేస్తున్నారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ అన్నారు.

పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు
చెక్కును అందజేస్తున్న రాములు నాయక్‌

వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌

జూలూరుపాడు, సెప్టెంబరు 17: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం కేసీఆర్‌ పార్టీ లకు అతీతంగా సంక్షేమ పథకాలను మంజూరు చేస్తున్నారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ అన్నారు. మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన 21 మంది లబ్దిదారులకు కళ్యా ణలక్ష్మీ పథకం క్రింద రూ.21.2 లక్షలను ప్రభుత్వం మంజూరి చేసింది. దీంతో శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణాలో సీఎం కేసీఆర్‌ ఎంతో అభివృద్ధి చేస్తున్నారని, వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రవే శ పెట్టి దేశంలోనే రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపారని అన్నారు. అభివృద్ది, సంక్షేమంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణానే ముం దు ఉందని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే నల్లబం డబోడు గ్రామాన్ని సందర్శించారు. దీంతో ప్రజలు ఎమ్మెల్యేను కలిసి తమ గ్రామానికి బీటీ రహదారి లేకపోవడంతో తీవ్ర ఇ బ్బందులు పడుతున్నామని, రహదారిని మంజూరి చేయాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే ఐటీడీఏ అధికారులతో మాట్లాడి రహదారి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాధనలను సిద్ధం చేసి త్వరతిగతిన అందించాలని ఆదేశించారు. సీపీఎం నాయకులు యాసా కొండలరావు, ధర్మాలు ఎమ్మెల్యేను కలిసి వెంగన్నపాలెంలో పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి స్థలాన్ని కెటాయించడంతో పాటు, ప్రజా మరుగుదొడ్లను నిర్మించాలని వినతి పత్రాన్ని సమర్పించారు. 


Updated Date - 2021-09-18T04:28:39+05:30 IST