Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి విగ్రహ రాజకీయాలు మానుకోవాలి: దేవగుడి

కడప: జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విగ్రహ రాజకీయాలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అలజడి సృష్టించి వద్దన్నారు. దేవగుడిలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేయాలనుకుంటే తమకు సమాచారం ఇస్తే తాము ఊరు నుండి వెళ్లి పోతామని చెప్పారు. తమ ఊరులోని వైఎస్‌ఆర్ విగ్రహ బాధ్యత సుధీర్‌రెడ్డికే అప్పగిస్తున్నానని పేర్కొన్నారు. సుధీర్‌రెడ్డి, వైసీపీ నేత రామసుబ్బారెడ్డి ఇద్దరు కలిసి వచ్చి నివాళులు అర్పించి ఉంటే చాలా సంతోషంగా ఉండేదన్నారు. ఎవరో పెట్టిన విగ్రహాలకు పూలమాలలు వేయడం కాదని, మీ సొంత గ్రామాలలో విగ్రహాలు పెట్టి  నివాళులు అర్పించాలని దేవగుడి నారాయణరెడ్డి కోరారు.


Advertisement
Advertisement