13న టోక్యో అథ్లెట్లతో మోదీ భేటీ

ABN , First Publish Date - 2021-07-10T08:01:31+05:30 IST

ఒలింపిక్స్‌కు భారత సన్నాహకాలను ప్రధాని మోదీ..అధికారులతో శుక్రవారం వర్చువల్‌గా సమీక్షించారు.

13న టోక్యో అథ్లెట్లతో మోదీ భేటీ

ఒలింపిక్స్‌ 13 రోజుల్లో

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌కు భారత సన్నాహకాలను ప్రధాని మోదీ..అధికారులతో శుక్రవారం వర్చువల్‌గా సమీక్షించారు. టోక్యో వెళ్లనున్న దేశ అథ్లెట్లతో ఈనెల 13న భేటీ కానున్నట్టు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. 23న మొదలవనున్న విశ్వక్రీడలకు భారత తొలి బృందం ఈనెల 17న ఎయిరిండియా ప్రత్యేక విమానంలో జపాన్‌ వెళ్లనుంది. ‘ఒలింపిక్స్‌కు భారత్‌ సన్నద్ధమవుతున్న తీరుతెన్నులను సమీక్షించా. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, జపాన్‌కు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నా. 130 కోట్ల మంది దేశ ప్రజల తరపున 13వ తేదీన క్రీడాకారులతో సమావేశమై వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా. అందరం భారత ఆటగాళ్లను ఆశీర్వదిద్దాం’ అని ప్రధాని ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2021-07-10T08:01:31+05:30 IST