HYD : ‘మోదీ రేషన్‌.. మోదీ వ్యాక్సిన్‌’ అంటూ పోస్టర్లు

ABN , First Publish Date - 2021-07-23T14:57:43+05:30 IST

కరోనా కష్టకాలంలో ప్రతినెలా ఐదు కేజీల ఉచిత బియ్యం..

HYD : ‘మోదీ రేషన్‌.. మోదీ వ్యాక్సిన్‌’ అంటూ పోస్టర్లు
FILE PHOTO

హైదరాబాద్ సిటీ/కేపీహెచ్‌బీకాలనీ : కరోనా కష్టకాలంలో ప్రతినెలా ఐదు కేజీల ఉచిత బియ్యం, ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ మేరకు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గురువారం బీజేపీ నాయకులు కేపీహెచ్‌బీ నాలుగోఫేజ్‌లోని రేషన్‌ షాపు గోడకు ‘మోదీ రేషన్‌.. మోదీ వ్యాక్సిన్‌’ అనే పోస్టర్‌ను అంటించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ డివిజన్‌ అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, ఇన్‌చార్జి ఏనుగు శ్రీనివాస్‌రెడ్డి,  ప్రీతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-23T14:57:43+05:30 IST