పరిగిలో మనీలాండరింగ్‌ పేరిట కుచ్చుటోపీ

ABN , First Publish Date - 2021-01-17T04:38:32+05:30 IST

పరిగిలో మనీలాండరింగ్‌ పేరిట కుచ్చుటోపీ

పరిగిలో మనీలాండరింగ్‌ పేరిట కుచ్చుటోపీ
పరిగి : దుకాణంలో తనిఖీలు చేస్తున్న అధికారులు

పరిగి: మనీలాండరింగ్‌ పేరుతో ఓ వ్యక్తి జనాలకు కుచ్చుటోపీ పెడుతున్న వైనం శనివారం వెలుగులోకి వచ్చింది. పరిగి పట్టణంలో భవానీ మనీలాండరింగ్‌ పేరుతో దుకాణాన్ని తెరిచారు. పేదలు తమ అవసరాల కోసం ఆభరణాలను పెట్టి అప్పులు తీసుకుంటుంటారు.  సత్తమ్మ అనే మహిళ తన అవసరాల కోసం పెట్టిన నగలు విడిపించుకోవడానికి శనివారం వెళ్తే ఆభరణాలు లేవని చెప్పడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఇలా చాలా మందిని మోసం చేశారని బాధితులంతా కలిసి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు నరేందర్‌, వెంకట్‌రెడ్డి దుకాణంలో విచారణ జరిపారు. నాలుగేళ్ల నుంచి ఈ దుకాణాన్ని అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారని తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పరిగి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-01-17T04:38:32+05:30 IST