రైతు శిబిరాల్లో ‘ఉద్యమ భోగి’

ABN , First Publish Date - 2022-01-15T09:12:11+05:30 IST

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అమరావతి రైతులు శుక్రవారం

రైతు శిబిరాల్లో ‘ఉద్యమ భోగి’

  • 757వ రోజుకు అమరావతి రైతుల ఆందోళనలు 


తుళ్ళూరు, జనవరి 14: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అమరావతి రైతులు శుక్రవారం భోగి మంటలు వేసి అమరావతిని కాపాడాలని వేడుకున్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని రైతు ధర్నా శిబిరాలలో చేస్తున్న ఉద్యమం 758వ రోజుకు చేరుకుంది.


ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, మూడు రాజధానులతో ప్రయోజనం లేదని తెలిసినా ప్రభుత్వం మూడు ముక్కల ఆట మానుకోవటం లేదన్నారు. కక్ష కట్టి అమరావతి అభివృద్ధిని నిరోధిస్తున్నారన్నారు. పండుగ పర్వ దినాలను రోడ్డు మీద చేసుకోవాల్సి దుస్థితిని సీఎం జగన్‌రెడ్డి కల్పించారన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. దీపాలు వెలిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. మందడంలో అమరావతి ఉద్యమ సెగ పేరుతో మహిళలు, రైతులు భోగి మంటలు వేశారు. తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌, ఐకాసా కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌ ఈ వేడుకలలో పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-15T09:12:11+05:30 IST