బుల్లెట్ బండి పాటకు ఎంపీ మాలోతు కవిత డాన్స్

ABN , First Publish Date - 2021-08-26T17:45:13+05:30 IST

వరంగల్: మానుకోట ఎంపీ మాలోతు కవిత చిందేసి సందడి చేశారు.

బుల్లెట్ బండి పాటకు ఎంపీ మాలోతు కవిత డాన్స్

వరంగల్: మానుకోట ఎంపీ మాలోతు కవిత చిందేసి సందడి చేశారు. మహబూబాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ నేత ముత్యం వెంకన్న గౌడ్ కుమారుడి  వివాహానికి హాజరైన కవిత నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వారితో కలిసి బుల్లెట్‌ బండి పాటకు స్టేజీపై డ్యాన్స్‌ చేశారు. కవితతో పాటు పార్టీ నాయకురాలు హరిత కూడా సరదాగా డ్యాన్స్ చేశారు. ఇటీవల పాపులర్ అయిన బుల్లెట్ పాటకు వారు డ్యాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. 

Updated Date - 2021-08-26T17:45:13+05:30 IST