ఫామ్‌హౌజ్‌కే పరిమితమైన కేసీఆర్‌ పాలనకు పతనం తప్పదు: రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2020-08-14T14:54:23+05:30 IST

ప్రజా ఉద్యమాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికార బలంతో నిరంకుశంగా అణిచివేస్తోందని, విద్యార్థులు తిరగబడితే కేసీఆర్‌ గడీల పాలనకు పతనం తప్పదని రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజిగిరి ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థులు తిరుగుబాటు

ఫామ్‌హౌజ్‌కే పరిమితమైన కేసీఆర్‌ పాలనకు పతనం తప్పదు: రేవంత్ రెడ్డి

ప్రజా ఉద్యమాలను అణిచివేస్తున్న టీఆర్‌ఎస్‌

విద్యార్థులు తిరగబడితే కేసీఆర్‌ పాలనకు పతనం తప్పదు

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి


ఆమనగల్లు(రంగారెడ్డి): ప్రజా ఉద్యమాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికార బలంతో నిరంకుశంగా అణిచివేస్తోందని, విద్యార్థులు తిరగబడితే కేసీఆర్‌ గడీల పాలనకు పతనం తప్పదని రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజిగిరి ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థులు తిరుగుబాటు చేస్తే ఏ ప్రభుత్వాలూ మనలేవన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల, ఆమనగల్లు మండలాల్లో గురువారం రేవంత్‌రెడ్డి పర్యటించారు. పలుచోట్ల వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. కడ్తాల మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం పలికి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదలను నిరసిస్తూ ప్రగతిభవన్‌ను ముట్టడించిన ఎన్‌ఎ్‌సయూఐ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేయడం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. అరెస్ట్‌ చేసిన ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌, ఇతర నాయకులను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రగతిభవన్‌, ఫామ్‌హౌజ్‌లకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిమితమయ్యారని ఆరోపించారు. 


సీఎంను కలిసి సమస్యలు విన్నవించే అవకాశం లేకనే విద్యార్థులు ప్రగతిభవన్‌ను ముట్టడించారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్‌ఎ్‌సయూఐ నాయకులు విద్యార్థుల సమస్యలపై పోరాడారే తప్ప వారు సంఘ విద్రోహశక్తులు కాదన్నారు. కరోనా వైరస్‌ కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. కరోనా కేసులను, మరణాలను కప్పి పుచ్చుతోందని, ఇప్పటికైనా కరోనా టెస్ట్‌లను పెంచి నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని రేవంత్‌ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నర్సింహ, మండ్లీ రాములు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బీక్యానాయక్‌, రేవంత్‌మిత్ర మండలి రాష్ట్ర అద్యక్షుడు ఆసి్‌ఫఅలీ, నాయకులు  చేగూరి వెంకటేశ్‌, రామకృష్ణ, యాదయ్య గౌడ్‌, రామ్‌చందర్‌ నాయక్‌, మాల మల్లేశ్‌ గౌడ్‌, రాజేశ్‌, రవి, విజయ్‌, మహేందర్‌, రమేశ్‌, రజనీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-14T14:54:23+05:30 IST