Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎంటీఏఆర్‌ లాభంలో 103% వృద్ధి

వాటాదారులకు 30% డివిడెండ్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎంటీఏఆర్‌ టెక్నాలజీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం, మొత్తం ఏడాదికి ఆకర్షణీయంగా పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2021, మార్చితో ముగిసిన మూడు నెలలకు లాభం 103 శాతం వృద్ధితో రూ.8.9 కోట్ల నుంచి రూ.18 కోట్లకు పెరిగింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి 47 శాతం పెరిగి రూ.31.3 కోట్ల నుంచి రూ.46.1 కోట్లకు చేరినట్లు కంపెనీ ఎండీ శ్రీనివాస రెడ్డి తెలిపారు. సమీక్ష త్రైమాసికానికి ఆదాయం 12 శాతం పెరిగి రూ.69.2 కోట్లకు, మొత్తం ఏడాదికి 15 శాతం వృద్ధితో రూ.246.4 కోట్లకు చేరినట్లు చెప్పారు.


కంపెనీ బోర్డు 30 శాతం డివిడెండ్‌ను సిఫారసు చేసింది అంటే రూ.10 ముఖ విలువ కలిగిన షేరుపై రూ.3 డివిడెండ్‌ను కంపెనీ చెల్లించనుంది. కొవిడ్‌ వల్ల గత ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ.. కంపెనీ పనితీరు సంతృప్తికరంగానే ఉందని శ్రీనివాస రెడ్డి చెప్పారు. మార్చి నాటికి చేతిలో రూ.416 కోట్ల విలువైన ఆర్డర్లున్నందున రానున్న కాలంలో ఆదాయం ఆశాజనకంగా ఉండగలదని భావిస్తున్నామన్నారు. 


Advertisement
Advertisement