Advertisement
Advertisement
Abn logo
Advertisement

మ్యాజిక్ చేసిన ముంబై.. కేకేఆర్ చిత్తు

చెన్నై: ముంబై ఇండియన్స్ మ్యాజిక్ చేసింది. ఆఖరి 5 ఓవర్లలో ముంబై బౌలర్లు అదరగొట్టారు. కోల్‌కతా సునాయాసంగా విజయం సాధిస్తుందనుకున్న క్రికెట్ అభిమానులందరికీ షాక్ ఇస్తూ.. 10 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. 152 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని కేకేఆర్‌ను చిత్తుగా ఓడించింది. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ 4 వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్ 2 రెండు వికెట్లు, కృనాల్ పాండ్యా ఓ వికెట్ తీసుకున్నారు. ఇక కేకేఆర్ బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్లు నితీశ్ రాణా(57: 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు) అర్థ సెంచరీతో రాణించగా.. శుభ్‌మన్ గిల్(33: 24 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్) ఓ మోస్తరు పరుగులు చేశాడు. వీరిద్దరి తరువాత మరే బ్యాట్స్‌మన్ కూడా కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోవడం గమనార్హం. 

Advertisement
Advertisement