ముమ్మాటికీ కేసీఆరే రాక్షసుడు
ABN , First Publish Date - 2021-09-08T07:23:41+05:30 IST
‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎ్‌సఆర్‌ను మంత్రి శ్రీనివా్‌సగౌడ్ రాక్షసుడు అంటున్నారు. వేల మంది నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలకు కారకుడైన సీఎం కేసీఆరే ముమ్మాటికీ రాక్షసుడు.
వైఎస్‌ని కించపరిస్తే సహించేది లేదు: షర్మిల
మహబూబ్‌నగర్/హైదరాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎ్‌సఆర్‌ను మంత్రి శ్రీనివా్‌సగౌడ్ రాక్షసుడు అంటున్నారు. వేల మంది నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలకు కారకుడైన సీఎం కేసీఆరే ముమ్మాటికీ రాక్షసుడు. కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా వైఎ్‌సఆర్‌ను కించపరిస్తే సహించేది లేదు. ప్రజలు, వైఎ్‌సఆర్ అభిమానులే వారిని తరిమికొడతారు. మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారు’’ అని వైఎ్‌సఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీ ఎదుట వైఎ్సఆర్టీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ నిరాహార దీక్షలో ఆమె పాల్గొన్నారు. తాలిబాన్ల చేతిలో అఫ్ఘానిస్థాన్ చిక్కినట్లు కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని, ప్రజలు తిరగబడే సమయం వచ్చిందన్నారు. కాగా, షర్మిల తన దీక్షలను యూనివర్శిటీల బాట పట్టిస్తున్నారు. నిరుద్యోగ నిరాహార దీక్షను ఇక మీదట ప్రతివారం యూనివర్శిటీల ముందు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నివాసానికి వెళ్లి పరామర్శించి అక్కడే ఆమె ప్రతివారం దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను దీక్షలకు ఒప్పించడం పార్టీ నాయకత్వానికి ఇబ్బందిగా మారడంతో ఆమె వర్సిటీల బాటపట్టారు.