Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్కీట్‌లో మునేక్‌ ట్రిపుల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలంగాణకు చెందిన మునేక్‌ బత్తుల జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షి్‌ప షాట్‌గన్‌ విభాగంలో మూడు పతకాలతో అదరగొట్టాడు. స్కీట్‌ జూనియర్‌ మెన్‌ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం నెగ్గిన మునేక్‌..ఆయుష్‌ రుద్రరాజు, యువేక్‌తో కలిసి టీమ్‌ విభాగంలో రజతం కొల్లగొట్టాడు. అలాగే స్కీట్‌ పురుషుల టీమ్‌ విభాగంలో మునేక్‌, శ్రేయాన్‌ కపూర్‌, చేతన్‌ రెడ్డి త్రయం కాంస్య పతకం గెలుపొందింది. ఇక స్కీట్‌ వెటరన్‌ పురుషుల విభాగంలో గుస్తీ నోరియా రజత పతకం కైవసం చేసుకున్నాడు.

ఇషాకు  కాంస్యం:

10మీ. ఎయిర్‌ పిస్టల్‌ జూనియర్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో హైదరాబాదీ ఇషాసింగ్‌, కౌశిక్‌ గోపు ద్వయం కాంస్య పతకం నెగ్గింది. 

Advertisement
Advertisement