Abn logo
Nov 22 2021 @ 23:10PM

హేళన చేస్తోందని హతమార్చారు

వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ రోహిత్‌రాజు

అత్తను గొంతునులిమి హత్య చేసిన అల్లుళ్లు

సహజ మరణంగా చిత్రీకరించిన వైనం

పాల్వంచ పోలీసుల విచారణలో

నిజం ఒప్పుకున్న నిందితులు

పాల్వంచ రూరల్‌, నవంబర్‌ 22: తమను తరచూ అసభ్యపదజాలంతో తిడుతూ అందరిముందు చులకన చేసి మాట్లాడుతున్న అత్తపై అల్లుళ్లు పగపట్టారు. మానసిక క్షోభకు గురైన వారిరువురు కలిసి పఽథకం ప్రకారం అత్తను హత్యచేశారు. ఆ హత్యను సహజ మరణంగా చిత్రీకరించారు. కానీ పాల్వంచ రూరల్‌ పోలీసులు లోతుగా విచారణ జరిపి నిందితులను గుర్తించి వారిని కోర్టులో హాజరుపరిచారు. పాల్వంచ ఏఎస్‌పీ రోహిత్‌రాజు సోమవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆయన కఽథనం ప్రకారం మండల పరిధిలోని కోడిపుంజులవాగుకు చెందిన కొర్రా విజయ ఈనెల 14న మృతి చెందింది. భర ్త కొర్రా అమ్రు తన భార్య మద్యం తాగి నిద్రించిందని, ఉదయం లేచే సరికి మరణించిందని పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ కేసుపై పలు అనుమానాలు ఉన్న పోలీసులు పోస్టు మార్టం నిర్వహించారు. వాటి ఆధారంగా హత్య కేసుగా మార్పుచేసి రూరల్‌ ఎస్‌ఐ సుమన్‌ విచారణను వేగవంతం చేశారు. విచారణలో మృతురాలి అల్లుళ్లు నూనావత్‌ శ్రీహరి, తేజావత్‌ హరీష్‌లు ఉద్దేశపూ ర్వకం గా తమ అత్తను గొంతు నులిమి హత్య చేసినట్లుగా నిందితులు ఒప్పుకోవడంతో వారిని అదుపు లోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.