మురుగదాస్‌ హాలీవుడ్‌ చిత్రం

ABN , First Publish Date - 2020-11-29T06:59:04+05:30 IST

మెగా బడ్జెట్‌ ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్‌కు మెగాఫోన్‌ చేపట్టబోతున్నారు ప్రముఖ తమిళ దర్శకుడు ఏ. ఆర్‌. మురుగదాస్‌. విజయ్‌ 65వ చిత్రానికి ఆయనే డైరెక్టర్‌. అయితే క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వల్ల ఆ చిత్రం నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత, హాలీవుడ్‌ స్టూడియో డిస్నీ పిక్చర్స్‌ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహించేందుకు మురుగదాస్‌ అంగీకరించారు అని కోలీవుడ్‌ సమాచారం

మురుగదాస్‌ హాలీవుడ్‌ చిత్రం

మెగా బడ్జెట్‌ ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్‌కు మెగాఫోన్‌ చేపట్టబోతున్నారు ప్రముఖ తమిళ దర్శకుడు ఏ. ఆర్‌. మురుగదాస్‌. విజయ్‌ 65వ చిత్రానికి ఆయనే డైరెక్టర్‌. అయితే  క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వల్ల ఆ చిత్రం నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత, హాలీవుడ్‌ స్టూడియో డిస్నీ పిక్చర్స్‌ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహించేందుకు మురుగదాస్‌ అంగీకరించారు అని కోలీవుడ్‌ సమాచారం. ‘ద లయన్‌ కింగ్‌’, బ్యూటీ అండ్‌ ద బీస్ట్‌’ కోవలోనే భారతీయ మూలాలున్న కథతో ప్రపంచ ప్రేక్షకుల కోసం లైవ్‌ యాక్షన్‌ కమ్‌ యానిమేషన్‌ చిత్రంగా తెరకెక్కుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని భావిస్తున్నారు. అదే నిజమైతే ప్రపంచస్థాయి చిత్రానికి దర్శకత్వం వహిస్తోన్న తొలి తమిళ దర్శకుడుగా మురుగదాస్‌ గొప్ప గౌరవం పొందిన ట్టే అంటున్నాయి సినీవర్గాలు.

Updated Date - 2020-11-29T06:59:04+05:30 IST