నేర్పుగా చదవాలి!

ABN , First Publish Date - 2020-03-09T06:37:34+05:30 IST

గంటల తరబడి చదివితేనే పాఠాలు గుర్తుంటాయి అనుకుంటే పొరపాటు. చదివినది బుర్రకు ఎక్కాలంటే మెదడును చురుగ్గా ఉంచే చిట్కాలు పాటించాలి. అవేమిటంటే....

నేర్పుగా చదవాలి!

గంటల తరబడి చదివితేనే పాఠాలు గుర్తుంటాయి అనుకుంటే పొరపాటు. చదివినది బుర్రకు ఎక్కాలంటే మెదడును చురుగ్గా ఉంచే చిట్కాలు పాటించాలి. అవేమిటంటే....

ఏకధాటిగా 30 నుంచి 50 నిమిషాలు చదివితే ఆ తర్వాత కనీసం పది నిమిషాల పాటు అయినా బ్రేక్‌ తీసుకోవాలి. చదివినది గుర్తుండడానికి ఇదే సరైన పద్ధతి.

పిప్పరమెంట్‌కు మెదడును ప్రేరేపించే శక్తి ఉంటుంది. ఏకాగ్రతనూ పెంచుతుంది కూడా. కాబట్టి చదివే ప్రదేశంలో ఈ ఎసెన్షియల్‌ ఆయిల్‌ సువాసన వెదజల్లేలా చూసుకోవాలి.

చదివే సమయంలో చాక్లెట్‌ తింటే, అందే సమాచారాన్ని మెదడు తేలికగా సంగ్రహిస్తుంది.

ఎక్కువ వివరణను ఒకే ఒక్క పదంలో చెప్పాలి అనుకుంటే, wordhippo.com వెబ్‌సైట్‌ వెతకండి.

 ఏదైనా సబ్జెక్ట్‌ చదివేటప్పుడు దాన్ని ఇంకొకరికి నేర్పించాలి అనే ఆలోచనతో చదవాలి. అప్పుడు ఏకాగ్రత మరింత పెరుగుతుంది.

Updated Date - 2020-03-09T06:37:34+05:30 IST