ముసుండలు
ABN , First Publish Date - 2020-09-12T18:00:07+05:30 IST
రాగులు - అరకప్పు, సజ్జలు - అరకప్పు, పిండి - ఒక కప్పు, శొంఠి పొడి - పావు టీస్పూన్, గసగసాలు - రెండు టీస్పూన్లు, యాలకుల పొడి - చిటికెడు, బెల్లం పొడి - రెండు కప్పులు,
కావలసినవి: రాగులు - అరకప్పు, సజ్జలు - అరకప్పు, పిండి - ఒక కప్పు, శొంఠి పొడి - పావు టీస్పూన్, గసగసాలు - రెండు టీస్పూన్లు, యాలకుల పొడి - చిటికెడు, బెల్లం పొడి - రెండు కప్పులు, నీళ్లు - ఒక కప్పు, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా.
తయారీ: ఒక పాత్రలో బెల్లం తీసుకుని అందులో రాగులు, సజ్జలు, పిండి, శొంఠిపొడి, గసగసాలు, యాలకులపొడి వేసి, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపాలి. స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ బాల్స్ మాదిరిగా చేసుకుంటూ నూనెలో వేయాలి. ముదురు గోధుమ రంగులోకి మారే వరకు వేగించుకుని తీసుకోవాలి. ఇవి పది రోజుల వరకు నిల్వ ఉంటాయి.