నా రాజకీయ జీవిత ప్రదాత కేసీఆర్
ABN , First Publish Date - 2022-01-28T05:08:53+05:30 IST
నా రాజకీయ జీవిత ప్రదాత కేసీఆర్
- వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
- ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన టీఆర్‌ఎస్ జిల్లా నూతన అధ్యక్షుడు
వికారాబాద్, జనవరి 27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సీఎం కేసీఆర్‌ను వికారాబాద్ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ గురువారం కలిశారు. జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన సందర్భంగా ఆయన మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, పరిగి, కొడంగల్ ఎమ్మెల్యేలు కె.మహే్‌షరెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, పార్టీ నేత కార్తీక్‌రెడ్డిలతో కలిసి ప్రగతి భవన్‌లో సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు మొక్క అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తన రాజకీయ జీవిత ప్రదాత అని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. పార్టీ జిల్లా బాధ్యతలు బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించిన కేసీఆర్ నమ్మకాన్ని వమ్ముచేయకుండా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు రావాలని ఈ సందర్భంగా ఆనంద్ ఆహ్వానించారు.