8 అంగుళాల సందులో.. తలకిందులుగా మహిళ.. కేకలు వేయడంతో..

ABN , First Publish Date - 2021-07-16T05:18:41+05:30 IST

అమెరికాలోని కాలిఫోర్నియాలో వింత ఘటన చోటుచేసుకుంది. కేవలం 8 అంగుళాల సందులో ఒక మహిళ ఇరుక్కుపోయింది. రెండు కమర్షియల్ బిల్డింగుల మధ్యలో ఉన్న ఆ సందులోకి ఆమె ఎలా చేరిందీ ఎవ

8 అంగుళాల సందులో.. తలకిందులుగా మహిళ.. కేకలు వేయడంతో..

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో వింత ఘటన చోటుచేసుకుంది. కేవలం 8 అంగుళాల సందులో ఒక మహిళ ఇరుక్కుపోయింది. రెండు కమర్షియల్ బిల్డింగుల మధ్యలో ఉన్న ఆ సందులోకి ఆమె ఎలా చేరిందీ ఎవరికీ తెలీదు. కానీ ఒక షాపు యజమాని తమ షాపులోని వెనుక గోడలో నుంచి కేకలు వినిపించడంతో హడలిపోయాడు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆమె కేకలు విన్న చాలా మంది ఆమె కోసం గాలించారు. కానీ ఎవరికీ ఆమె కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కూడా అక్కడకు చేరుకొని చాలాసేపు ఆమె కోసం వెతికారు. ఆ తర్వాత రెండు బిల్డింగుల మధ్యలో ఉన్న 8 అంగుళాల సందులో ఆమె తలకిందులుగా ఉన్నట్లు వాళ్లు గుర్తించారు. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ఫైటర్లు.. డ్రిల్లింగ్ మిషన్‌తో ఒక బిల్డింగు గోడకు పెద్ద కన్నం చేసి ఆమెను రక్షించారు. ఆమె నగ్నంగా, తలకిందులుగా ఆ సందులో ఇరుక్కుపోయింది. ఇలా ఎందుకు జరిగిందీ ఇంకా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ఆమెను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.


Updated Date - 2021-07-16T05:18:41+05:30 IST