సాగర్‌లో ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారాలు
ABN , First Publish Date - 2021-04-05T16:34:06+05:30 IST
నాగార్జున సాగర్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి.
నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. పెద్దవూర మండలం, బోనూతుల, కుంకుడు చెట్టు తండా, చలకుర్తి గ్రామాల్లో టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, విప్ బాల్క సుమన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే త్రిపురారంలో నోముల భగత్‌కు మద్దతుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.
అనుముల మండలం, హాజరిగూడెం, నాయుడుపాలెం గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి పానుగోతు రవి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి అనుముల మండలం, శ్రీనాధపురం, చింతగూడెం, రామడుగు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.