వీస్‌ ధనాధన్‌

ABN , First Publish Date - 2021-10-21T09:25:29+05:30 IST

అరంగేట్ర జట్టు నమీబియా తనకంటే ఎంతో మెరుగైన నెదర్లాండ్స్‌కు షాకిచ్చింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లతో నెదర్లాండ్స్‌ను ఓడించి టీ20 వరల్డ్‌ కప్‌ తొలిరౌండ్‌లో మొదటి విజయం రుచి చూసింది. టోర్నీలో కొనసాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ..

వీస్‌ ధనాధన్‌

  • నెదర్లాండ్స్‌కు నమీబియా షాక్‌


అబుధాబి: అరంగేట్ర జట్టు నమీబియా తనకంటే ఎంతో మెరుగైన నెదర్లాండ్స్‌కు షాకిచ్చింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లతో నెదర్లాండ్స్‌ను ఓడించి టీ20 వరల్డ్‌ కప్‌ తొలిరౌండ్‌లో మొదటి విజయం రుచి చూసింది. టోర్నీలో కొనసాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ డేవిడ్‌ వీస్‌ (40 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 66 నాటౌట్‌) భారీషాట్లతో చెలరేగాడు. దాంతో 165 పరుగుల లక్ష్యాన్ని నమీబియా ఇంకా ఓవర్‌ మిగిలుండగానే కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 9 ఓవర్లలో 52/3తో కష్టాల్లో పడిన తరుణంలో క్రీజులోకి వచ్చిన వీస్‌ బౌలర్లపై విరుచుకుపడి మ్యాచ్‌ గతిని మార్చివేశాడు. ఈ క్రమంలో కెప్టెన్‌ గెరార్డ్‌ ఎరాస్మస్‌ (32)తో కలిసి వీస్‌ నాలుగో వికెట్‌కు 93 రన్స్‌ జోడించాడు. అంతకుముందు ఓపెనర్‌ మ్యాక్స్‌ ఒడౌడ్‌ (70) వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ చేయడంతో నెదర్లాండ్స్‌ 164/4 స్కోరు చేసింది. ఒడౌడ్‌ మూడో వికెట్‌కు అకెర్‌మన్‌తో కలిసి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 


సంక్షిప్తస్కోర్లు:

నెదర్లాండ్స్‌: 20 ఓవర్లలో 164/4 (మ్యాక్స్‌ ఒడౌడ్‌ 70, అకెర్‌మన్‌ 35,  నాటౌట్‌, ఫ్రిలింక్‌ 2/36).

నమీబియా: 19 ఓవర్లలో 166/4 (డేవిడ్‌ వీస్‌ 66 నాటౌట్‌, ఎరస్మాస్‌ 32, స్మిట్‌ 14 నాటౌట్‌).

Updated Date - 2021-10-21T09:25:29+05:30 IST