Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీలో ఆడబిడ్డలు బలైపోతుంటే సీఎం జగన్ సిమ్లాలో ఎంజాయ్..: లోకేష్

అమరావతి: రాష్ట్రంలో రోజుకో ఆడబిడ్డ బలైపోతుంటే సీఎం జగన్మోహన్‌రెడ్డి  సిమ్లాలో ఎంజాయ్ చేసొచ్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. మంగళవారం  లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ సత్యనారాయణపురంలో బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యానికి అద్దంపడుతుందన్నారు. ఇక 8 పని దినాలు మాత్రమే మిగిలాయని  బీటెక్‌ విద్యార్ధిని రమ్యని హత్య చేసిన నిందితుడికి ఉరేసి మహిళలకు భరోసా ఇచ్చేది ఎప్పుడు?అని లోకేష్ ప్రశ్నించారు.


Advertisement
Advertisement