అనాథాశ్రమానికి నాట్స్ చేయూత!

ABN , First Publish Date - 2020-04-09T07:09:44+05:30 IST

అమెరికాలో తెలుగు ప్రజలకు అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తెలుగు రాష్ట్రాల్లో కూడా సేవా కార్యక్రమాలను ముమ్మరంగా చేస్తోంది. కరోనా

అనాథాశ్రమానికి నాట్స్ చేయూత!

అమరావతి: అమెరికాలో తెలుగు ప్రజలకు అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తెలుగు రాష్ట్రాల్లో కూడా సేవా కార్యక్రమాలను ముమ్మరంగా చేస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింన విషయం తెలిసిందే. దీంతో అనాథ ఆశ్రమాలకు తనవంతు సాయం చేయడానికి నాట్స్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా.. గుంటూరు జిల్లా నిడుబ్రోలులోని గోతాలస్వామి అనాథ ఆశ్రమానికి కావాల్సిన నిత్యావసర సరుకులను నాట్స్ ఉచితంగా పంపిణీ చేసింది. నాట్స్ అధ్యక్షులు శ్రీనివాస్ మంచికలపూడి సౌజన్యంతో స్థానిక సీఐ.. నిత్యావసర సరుకులను అనాథ ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు. కాగా.. అనాథ ఆశ్రమానికి ఎటువంటి సాయం కావాల్సి వచ్చినా చేసేందుకు సిద్ధంగా ఉంటామని నాట్స్ అధ్యక్షులు శ్రీనివాస్ మంచికలపూడి సన్నిహితులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కామేపల్లి వెంకటేశ్రరావు, దొంతినేని సాయికృష్ణ, బొద్దూలూరి కిశోర్ బాబు, అడ్వకేట్ బాజీ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-04-09T07:09:44+05:30 IST