Advertisement
Advertisement
Abn logo
Advertisement

టెంపాలో యూత్ క్రికెట్ టోర్నమెంట్‌కు NATS మద్దతు

టీషర్టులు, ట్రోఫీలు, పతకాలు అందించిన నాట్స్

టెంపా: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) టెంపాలో టెంపా క్రికెట్ లీగ్ వారు నిర్వహించిన అండర్ 15 యూత్ క్రికెట్ టోర్నమెంట్‌కు తన వంతు మద్దతు, సహకారాన్ని అందించింది. స్థానిక రూరీ సాప్ట్‌వేర్ టెక్నాలజీస్‌తో కలిసి విజేతలకు, క్రికెట్ ప్లేయర్లకు టీ షర్టులు, ట్రోఫీలు అందజేసింది. అండర్-15 విభాగంలో పాల్గొన్న భారతీయ క్రీడాకారులకు నాట్స్ టెంపా బే విభాగం మద్దతు ఇచ్చి వారిలో క్రీడాస్ఫూర్తిని ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో నాట్స్ టీ షర్టులు, ట్రోఫీలు, పతకాలు అందించింది. అట్లాంటా జార్జియా, బ్లూమింగ్టన్ ఒహియో, ఆర్లాండో, టెంపా ఫ్లోరిడాలతో కూడిన నాలుగు జట్లు ఈ టోర్నమెంటులో తలపడ్డాయి. 

15 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న 64 మంది ఆటగాళ్లు ఈ టోర్నమెంట్‌లో ఉత్సాహంగా పాల్గొని తమలోని క్రికెట్ ప్రతిభను చూపించారు. టోర్నమెంట్‌ టైటిల్‌ను ఓర్లాండో నుండి ఫ్లోరిడా పాంథర్స్ గెలుచుకుంది. టెంపా జట్టు రన్నరప్‌గా రెండవ స్థానంలో నిలిచింది. క్రికెట్ టోర్నమెంట్‌కు నాట్స్ ఇచ్చిన మద్దతు మరువలేనిదని టెంపా క్రికెట్ లీగ్‌కు చెందిన నితీష్ శెట్టి అన్నారు. నాట్స్, ఎస్.జి.ఐ.ఎస్ ఫిల్మ్స్, రోటరీ క్లబ్ ఆఫ్ న్యూ టెంపా, శ్రీనివాస్ మల్లాదిలకు నితీష్ శెట్టి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 

నాట్స్ మాజీ ఛైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ బోర్డు కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ వైస్ ప్రెసిడెంట్(ఫైనాన్స్/మార్కెటింగ్) శ్రీనివాస్ మల్లాది, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కాండ్రు తదితరులు ఈ టోర్నమెంట్‌కు తమ వంతు మద్దతు సహకారం అందించారు. నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శేఖర్ అన్నేతో పాటు రవి గుమ్మడిపూడి, శ్రీనివాస్ కాకుమాను, రంజిత్ చాగంటి, మురళీ మేడిచర్ల తదితరులకు నాట్స్ టెంపా విభాగం ధన్యవాదాలు తెలిపింది.


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement