ఘనంగా భారత నావికా దళ దినోత్సవ ఉత్సవాలు

ABN , First Publish Date - 2020-12-04T21:10:44+05:30 IST

భారత నావికాద‌ళ దినోత్స‌వాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అమర సైనికుల స్తూపం వద్ద నావికా దళ అధికారులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు

ఘనంగా భారత నావికా దళ దినోత్సవ ఉత్సవాలు

హైద‌రాబాద్‌: భారత నావికాద‌ళ దినోత్స‌వాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అమర సైనికుల స్తూపం వద్ద నావికా దళ అధికారులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. స్టేషన్ కమాండర్ (నేవీ) రేర్ అడ్మిరల్ వి.రాజ శేఖర్, విశ్రాంత అధికారి రేర్ అడ్మిరల్ ఏ .వి .ఎస్ మాధవరావు హాజరై నివాళులర్పించారు.భార‌త‌దేశం ప్ర‌తి ఏటా డిసెంబ‌ర్ 4వ తేదీ నాడు నావికాద‌ళ దినోత్స‌వాన్ని జ‌రుపుకొంటోంది.


1971 లో జ‌రిగిన భార‌త్-పాక్ యుద్ధ సమయంలో చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ట్రైడెంట్ లో భాగం గా కరాచీ నౌకాశ్ర‌యం పై విద్యుత్ శ్రేణి కి చెందిన క్షిప‌ణి స‌హిత ప‌డ‌వ‌ల తో జ‌రిపిన దాడి విజ‌య‌వంతం కావ‌డాన్ని స్మ‌రించుకొంటూ, ఈ నావికా ద‌ళ దినోత్స‌వాన్ని నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీ గా వ‌స్తోంది.  నావికాద‌ళ దినోత్స‌వాల లో భాగం గా దేశం లోని అన్ని నౌకాద‌ళ స్థావ‌రాల లో వివిధ కార్య‌క్ర‌మాల ను నిర్వ‌హించ‌నున్నారు.  వారం రోజుల పాటు హైద‌రాబాద్‌, సికింద‌రాబాద్ ల‌లో కూడా పలు కార్య‌క్ర‌మాల ను నిర్వహించనున్నట్లు భార‌తీయ నావికాద‌ళం ఓ ప్ర‌క‌ట‌న లో తెలిపింది.

Updated Date - 2020-12-04T21:10:44+05:30 IST