నవాజ్‌ జంగ్‌ బహద్దూర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-07-12T09:43:19+05:30 IST

నవాబ్‌అలీ నవాజ్‌ జంగ్‌ బహాద్దూర్‌ను ఆదర్శంగా తీసుకుని నేటి ఇంజనీర్లు అభివృద్ధికార్యక్రమాలను రూపొందించాలని నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌

నవాజ్‌ జంగ్‌ బహద్దూర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఇంజనీరింగ్‌ డే వేడుక


ఖమ్మం కలెక్టరేట్‌, జూలై 11: నవాబ్‌అలీ నవాజ్‌ జంగ్‌ బహాద్దూర్‌ను ఆదర్శంగా తీసుకుని నేటి ఇంజనీర్లు అభివృద్ధికార్యక్రమాలను రూపొందించాలని నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ స్వర్గం నర్సింహారావు కోరారు. శనివారం ఖమ్మంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహద్దూర్‌ 143 జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా నవాజ్‌ జంగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో బహద్దూర్‌ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీఈఈ రవికుమార్‌, డిప్యూటీ ఎస్‌ఈ రాంప్రసాద్‌, డీఈఈ అర్జున్‌, బాలబ్రహ్మంతో పాటు  నీటిపారుదల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-07-12T09:43:19+05:30 IST