Advertisement
Advertisement
Abn logo
Advertisement

కిచెన్‌ను తీర్చిదిద్దుకోవాలిలా..!

అపార్టుమెంటు ఫ్లాట్స్‌ అందంగా తీర్చిదిద్దుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ప్రత్యేకంగా ఇంటీరియర్‌ డిజైన్‌ చేయించుకుంటూ ఉంటారు. త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ ఎంచుకుంటే ఇంటీరియర్‌ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం!


  • ముందుగా ఫ్లాట్‌ ఎంపిక చేసుకునే సమయంలోనే గాలి వెలుతురు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. నార్త్‌ ఈస్ట్‌ కార్నర్‌లో ఉన్న ఫ్లాట్‌ లేదా సౌత్‌ ఈస్ట్‌ కార్నర్‌లో ఉన్న ఫ్లాట్‌ను ఎంచుకుంటే బాగుంటుంది. ఇక ఫ్లాట్‌లో మాడ్యులర్‌ కిచెన్‌ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. 
  • చాలా మంది డార్క్‌ కలర్‌ ఉన్న మాడ్యులర్‌ కిచెన్‌వైపు వెళుతుంటారు. కానీ వాటి వల్ల బ్యాక్టీరియా ఫామ్‌ అవుతుంది. గాలి, వెలుతురు ఉంటే బ్యాక్టీరియా ఫామ్‌ కాదు. అందుకే లైట్‌ కలర్స్‌, బీచ్‌ కలర్స్‌ ఎంచుకోవాలి. డార్క్‌ కలర్స్‌ అయితే నిర్వహణ సులభం కానీ బ్యాక్టీరియా ఇబ్బందులు ఉంటాయి.
  • ప్రస్తుతం మాడ్యులర్‌ కిచెన్‌ ధర చదరపు అడుగుకి 900 నుంచి 2800 వరకు తీసుకుంటున్నారు. ఇందులో నాణ్యత, కంపెనీ బట్టి ఎంపిక చేసుకోవాలి. ఏదో ఒక కంపెనీ అని కాకుండా మంచి కంపెనీ ఎంచుకోవాలి. టేస్ట్‌కు తగ్గట్టుగా డిజైన్‌ చేసి ఇమ్మని అడగవచ్చు. ఏడు సంవత్సరాల పిల్లలకు బెడ్‌రూమ్‌ ఎలా కావాలో అడిగి వాళ్ల అభిరుచికి తగ్గట్టుగా చేసి ఇచ్చే వారున్నారు.
  • గ్యాస్‌ సిలిండర్‌ను నూటికి 90 శాతం మంది కిచెన్‌లో పెట్టుకుంటారు. అలాకాకుండా బాల్కనీలో యుటిలిటీ ఏరియా నుంచి పైప్‌లైన్‌ తీసుకుని పెట్టుకోవాలి. మాడ్యులర్‌ కిచెన్‌ ఏర్పాటు చేసుకునే  సమయంలో లేదా బిల్డర్‌కు చెప్పి నిర్మాణ సమయంలో ఆ ఏర్పాటు చేసుకోవచ్చు.
  • ఇక సింక్‌ తప్పనిసరిగా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ది ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడూ తడిగా ఉండే ప్రదేశం సింక్‌ కాబట్టి స్టీల్‌ సింక్‌ ఉత్తమం. 
  • కిచెన్‌ టాప్‌ గెలాక్సీ బ్లాక్‌ వేసుకున్నట్టయితే దానికి వైట్‌ అండ్‌ గ్రేలో ఇల్లు డిజైన్‌ చేసుకోవాలి. టాప్‌ రెడ్‌ కలర్‌ వేసుకుంటే కనుక బీచ్‌ కలర్‌ వేసుకోవాలి.
  • కిచెన్‌లో కచ్చితంగా చిమ్నీ ఏర్పాటు చేసుకోవాలి. కిచెన్‌ విస్తీర్ణం చిన్నగా ఉన్నా కూడా చిమ్నీ పెట్టుకోవచ్చు. నాలుగున్నర నుంచి ఇరవై నాలుగు వేల బడ్జెట్‌లో చిమ్నీలు లభిస్తున్నాయి. మాడ్యులర్‌ కిచెన్‌లో భాగంగా చిమ్నీని కూడా ఏర్పాటు చేస్తారు. 
Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...