Advertisement
Advertisement
Abn logo
Advertisement

అనంతపురంలో నయా మోసం

అనంతపురం: జిల్లాలో జరుగుతున్న నయా మోసం వెలుగులోకి వచ్చింది. లక్ష రూపాయలకు ప్రతి నెలా 30 వేలు ఇస్తామని,  పది నెలల్లో మూడు లక్షలు ఇస్తామంటూ బురిడీ కొట్టిస్తున్న ముఠా మోసం బట్టబయలయింది. నాగ్‌పూర్‌కు చెందిన ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ పేరుతో ముఠా సభ్యులు కోట్లలో వసూలు చేశారు. అయితే వారి చేతిలో కొంతమంది మోసపోయారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఎస్పీని ఆశ్రయించారు. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు ఉన్నట్లు భావిస్తున్నారు. రహస్య ప్రదేశంలో ముఠా సభ్యులను పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. 

Advertisement
Advertisement