దర్బంగా బ్లాస్ట్ కేసులో కొత్త కోణం
ABN , First Publish Date - 2021-07-06T21:00:15+05:30 IST
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టియించిన దర్భంగా పేలుళ్లు కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి.
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్భంగా పేలుళ్లు కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. మాలిక్ సోదరులతో పాటు సికింద్రాబాద్‌కు వచ్చిన క్యాబ్ డ్రైవర్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు ఆరా తీస్తున్నారు. క్యాబ్‌లో వెళ్లేటప్పుడు మాలిక్ సోదరులు ఏం మాట్లాడుకున్నారు? అని ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదులకు క్యాబ్ డ్రైవర్ సహకరించారా? లేదా అనే కోణంలో ఎన్ఐఏ అధికారులు విచారణ చేపడుతున్నారు.
అలాగే ఈ కేసులో ఉగ్రకోణం దాగి ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో నలుగురుని అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుళ్లకు రసాయనాలు హైదరాబాద్ కేంద్రంగా తరలించినట్లు నేషనల్ ఇన్వెస్ట్ గేషన్ ఏజెన్సీ నిర్ధారించింది. దీంతో హైదరాబాద్‌లో ఉంటూ పేలుళ్లుకి కుట్ర పన్నిన ఇద్దరు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.