తీసిన ఫొటోలు స్పష్టంగా..!

ABN , First Publish Date - 2020-07-11T06:28:21+05:30 IST

మొబైల్‌తో ఫొటో క్లిక్‌ అనిపిస్తాం! తీరా చూస్తే ఆ ఫొటో బ్లర్‌గా ఉంటుంది. బ్లర్‌గా ఉన్న ఫొటోను ఏం చేయలేక డిలీట్‌ చేస్తాం. అయితే కొత్త ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టూల్‌ ‘పల్స్‌’ మీ చేతిలో ఉంటే ఎలాంటి బ్లర్‌ ఫొటో అయినా హై క్వాలిటీ ఫొటోగా

తీసిన ఫొటోలు స్పష్టంగా..!

మొబైల్‌తో ఫొటో క్లిక్‌ అనిపిస్తాం! తీరా చూస్తే ఆ ఫొటో బ్లర్‌గా ఉంటుంది. బ్లర్‌గా ఉన్న ఫొటోను ఏం చేయలేక డిలీట్‌ చేస్తాం. అయితే కొత్త ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టూల్‌ ‘పల్స్‌’ మీ చేతిలో ఉంటే ఎలాంటి బ్లర్‌ ఫొటో అయినా హై క్వాలిటీ ఫొటోగా మారిపోతుంది. అమెరికాలోని డ్యూక్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ ఏఐ టూల్‌ను అభివృద్ధి చేశారు. ఈ టూల్‌ సహాయంతో 64 సార్లు ఫొటో రిజల్యూషన్‌ను పెంచే అవకాశం ఉంది. పల్స్‌ టూల్‌ 16 X 16 పిక్సెల్‌ ఉన్న ఫొటోను 1024 X 1024 పిక్సెల్‌ ఉన్న ఫొటోగా కొన్ని సెకన్లలో మార్చగలదు. సీసీ కెమెరాలు చిత్రీకరించిన ఫొటోలలో చాలా వరకు మనుషుల ముఖం గుర్తించలేకుండా ఉంటుంది. అలాంటి సమయంలో ఈ టూల్‌ బాగా ఉపయోగపడనుంది.

Updated Date - 2020-07-11T06:28:21+05:30 IST