రాహుల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్

ABN , First Publish Date - 2021-08-27T01:16:45+05:30 IST

పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. రూ.6 కోట్ల వివాదంలో గాయత్రికి రాహుల్ ఫోన్ చేశారు.

రాహుల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్

విజయవాడ: పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. రూ.6 కోట్ల వివాదంలో గాయత్రికి రాహుల్ ఫోన్ చేశారు. మాట్లాడుకుందాం అంటూ గాయత్రికి ఆయన ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. ఈ సమాచారాన్ని కోరాడ విజయ్‌కు గాయత్రి అందించింది. ఇంటి నుండి రెగ్యులర్ స్పాట్ డివి మ్యానర్ ప్రాంతానికి రాహుల్ చేరుకున్నారు. అక్కడ నుండి రాహుల్‌ను దుర్గ కళామందిర్ థియోటర్‌కు కోరాడ తీసుకువెళ్లారు. దుర్గా కళామందిర్‌లో రాహుల్‌ను చిత్రహింసలకు గురిచేసి ఫ్యాక్టరీ ప్రాపర్టీ బలవంతంగా కోరాడ, కోగంటి సత్యం రాయించుకున్నట్టు సమాచారం. అక్కడ నుండి కారులో తిరిగి రాహుల్ మర్డర్ స్పాట్‌కు కోరాడ, బాబురావు, సీతయ్య, మరో ముగ్గురు కోరాడ అనుచరులు చేరుకున్నారు. కారులో రాహుల్ ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో రాహుల్ కాల్ డేటా, సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. శుక్రవారం కోరాడ, సీతయ్య, బాబురావులను పోలీసులు కోర్టులో హాజరుపరుచనున్నారు. రాహుల్ హత్య కేసుపై రేపు మీడియా సమావేశంలో పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించనున్నారు.

Updated Date - 2021-08-27T01:16:45+05:30 IST