కొత్తగా 161 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-01-18T07:39:51+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొద్ది రోజులుగా కేసులు వందల్లోనే నమోదవుతున్నాయి.

కొత్తగా 161 కరోనా కేసులు

అమరావతి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొద్ది రోజులుగా కేసులు వందల్లోనే నమోదవుతున్నాయి. మరణాలు కూడా ఒకటి, రెండుకి మించడం లేదు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 36,091 శాంపిల్స్‌ను పరీక్షిస్తే.. 161 మందికి పాజిటివ్‌గా తేలిందని వైద్యఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. చిత్తూరులో 52 కేసులు బయటపడితే.. కృష్ణాలో 26, గుంటూరులో 19 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8,85,985కి చేరుకుంది. కరోనా నుంచి తాజాగా 251 మంది కోలుకోవడంతో రికవరీల సంఖ్య 8,76,949కి పెరిగింది. విశాఖపట్నంలో కరోనాతో ఒకరు చనిపోవడంతో మరణాలు 7,140కి చేరుకున్నాయి. కాగా.. రాష్ట్రంలో చిత్తూరు, కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల మినహా మిగిలిన చోట్ల కేసులు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అవుతున్నాయి. దీంతో కొవిడ్‌-19 ప్రభావం తగ్గినట్టేనని ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు. వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి రావడంతో సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఉండకపోవచ్చని చెబుతున్నారు.


Updated Date - 2021-01-18T07:39:51+05:30 IST